Saturday, January 29, 2011

మంచి సంగీతం గొప్ప సంగీతం వేరు వేరు అని ఈ మద్యే తెలిసింది.
మంచి సంగీతం వినడానికి బావుంటూ అందరికీ నచ్చుతుందట. కాని గొప్ప సంగీతం వినడానికి కొందరికే బావుంటూ కొందరి మెప్పునే పొందుతుందట. ఇది కొందరికే నచ్చడానికి కారణం కొన్ని విపరీత సంధర్భాలలో మాత్రమే బావుంది అనిపిస్తూ వాళ్ళకు ఉపయోగపడటం. అలాంటి సంధర్భాలు ఇవట.
1. విపరీతమైన ఎండలో చెమటలు కక్కుతూ వచ్చినపుడు.
2. ఆకాశం మబ్బులు పట్టి వర్షం కురుస్తు ఉన్నపుడు.
3. చాలా విసుగ్గా ఉన్నపుడూ.
4. చాలా చా దిగులుగా ఉన్నపుడూ
5.గొడవలు పడిన తరువాత ఇలాటి సంధర్భాలలో ఈ సంగీతం గొప్ప సంగీతం అవుతుందట.

Thursday, April 8, 2010

వెండితెర వెలుగులో పోడూరు

పోడూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. పోడూరు చక్కని ప్రకృతి అందాలతో సమృద్ది గలిగిన పంట పొలాలతోనూ అభివృద్దిలో ఉన్న గ్రామము.;వెండితెర వెలుగులో పోడూరు అందాలు. పల్లె అందాలు.. ప్రకృతి రమణీయత.. పోడూరులో సినిమా షూటింగులకు సహజసిద్ధమైన హంగులను సమకూరుస్తున్నాయి. 1976 నుంచి ఈ గ్రామంలో తెలుగు సినిమా షూటింగులు చేపడుతున్నారు.. దర్శకులలో ప్రసిద్దులైన కోడి రామకృష్ణ, దాసరి నారాయణరావుల అధిక సినిమాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకొన్నవి. షూటింగ్ చేసుకొనేందుకు అన్ని సౌకర్యాలు,వసతి అందుబాటులో ఉండుటవలన నిరంతరం ఏదో ఒక షూటింగ్‌తో ప్రస్తుతం పోడూరు షూటింగ్ స్పాట్‌గా మారిపోయింది.